10 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై విద్యార్దుల‌కు గుడ్ న్యూస్

10 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌పై విద్యార్దుల‌కు గుడ్ న్యూస్

0

అవును లాక్ డౌన్ వేళ ఉద్యోగులు ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యారు, అలాగే వ్యాపారులు ఇళ్ల‌కు ప‌రిమితం అయ్యారు, ఈ స‌మ‌యంలో విద్యార్దుల‌కి కూడా మార్చి నుంచి జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల కూడా వాయిదాప‌డ్డాయి, అయితే ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల విష‌యంలో స్టూడెంట్స్ తెగ కంగారు ప‌డుతున్నారు, అయితే వైర‌స్ వ‌ల్ల లాక్ డౌన్ కొన‌సాగుతోంది, ఈ లాక్ డౌన్ ఎత్తాక ఎగ్జామ్స్ కి కొత్త షెడ్యూల్ విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్.

లాక్ డౌన్ పూర్తి అయిన త‌ర్వాత త్వరలో ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల టైం టేబుల్ విడుదల చేస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఇక లాక్ డౌన్ ముగిశాక రెండు వారాల‌కు ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి అని తెలిపారు.

దాదాపు రెండు వారాల పాటు ఈ పరీక్షలు కొనసాగే అవకాశం ఉందని మంత్రి అంటున్నారు. క‌చ్చితంగా ప‌రీక్ష‌ల స‌మ‌యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ.. మాస్కులు ధరించడం ద్వారా పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యే అవకాశాలపై ప్రభుత్వం ఆలోచ‌న చేస్తోంది. ఎప్పుడు ప‌రీక్ష‌లు జ‌రిగినా ఈ నియ‌మాలు అయితే పాటించాల్సిందే.