ఘోర రోడ్డు ప్రమాదం..డీసీఎంను ఢీకొట్టిన బైక్‌..యువకుడు దుర్మరణం

0

హైదరాబాద్‌ నగర శివార్లలోని దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలను పొట్టనపెట్టుకున్న రోడ్డు ప్రమాదాలు..తాజాగా మరో యువకుడి ప్రాణాన్ని కూడా బలితీసుకుంది. బహదూర్‌పల్లిలో రోడ్డుపై బ్రేక్‌డౌన్‌ అయిన డీసీఎంను బైక్‌ ఢీకొట్టడంతో యువకుడు అక్కడిక్కడే మృతిచెందారు.

ఈ ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో  ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి  సంతోష్‌గా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here