తాళికట్టేవేళ వరుడికి షాకిచ్చిన అమ్మాయి- ప్రియుడి కోసం అరగంట వెయిటింగ్

తాళికట్టేవేళ వరుడికి షాకిచ్చిన అమ్మాయి- ప్రియుడి కోసం అరగంట వెయిటింగ్

0

అక్కడ అంతా పెళ్లి సందడి, సరదా పలకరింపులు ఇక మరి అరగంటలో వధువు మెడలో వరుడు తాళికడతాడు, అందరూ ఈ శుభలగ్నం కోసం వెయిట్ చేస్తున్నారు, ఈ సమయంలో ఒక్కసారిగా సమయం అయింది.. తాళికట్టడానికి అబ్బాయి మంగళసూత్రం తీసుకుని అమ్మాయి మెడకి కట్టబోయాడు, ఒక్కసారిగా ఆమె అతని తాళి కట్టకుండా ఆపింది.

తమిళనాడు నీల్గిరీస్లోని మట్టకండి గ్రామంలో జరిగిన ఈ ఘటన పెళ్లిమండపంలోని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. నువ్వు అంటే నాకు ఇష్టం లేదు ఇదే సమయంలో నా మెడలో నా ప్రియుడు తాళికడతాడు, అని పెళ్లికొడుక్కి చెప్పింది, దీంతో అందరూ షాక్ అయ్యారు.

ఓ అరగంట వెయిట్ చేయాలి అని తెలిపింది. కొద్దిమంది బంధువుల సమక్షంలో ఇరువురి కుటుంబసభ్యులు అక్టోబర్ 29న ముహూర్తం పెట్టుకున్నారు. ఇలా అమ్మాయి అనడంతో ఆ అమ్మాయి తరపు వారు ఆమెకి సర్దిచెప్పినా ఆమె వినలేదు.. ఇక వరుడు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఎందుకు అని అక్కడ నుంచి వెళ్లిపోయాడు, ఈ సమయంలో అమ్మాయి పేరెంట్స్ బంధువులు కూడా ఆమెని అక్కడ వదిలేసి వెళ్లిపోయారు ప్రియుడు మాత్రం రాలేదట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here