తమ్ముడు లవర్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అన్న చివరకు ఏమైందంటే

తమ్ముడు లవర్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న అన్న చివరకు ఏమైందంటే

0

సురేందర్ అనే వ్యక్తి రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్నాడు, అతనికి తమ్ముడు యుగందర్ కూడా ఉన్నాడు. పంజాబ్ లోని ఓ పెళ్లి సంబంధం ఉంది అని సురేందర్ తండ్రి అతనిని పెళ్లి చూపులకి తీసుకువెళ్లాడు. అమ్మాయి చూడచక్కని బొమ్మలా ఉంది, ఆమెని చూడగానే సురేందర్ ఇష్టపడ్డాడు. అయితే ఆమె ఇంజనీరింగ్ చదువుతోందని మంచి ఉద్యోగం కాబట్టి మీకు ఇచ్చి చేస్తాం అన్నారు తల్లిదండ్రులు. అయితే అమ్మాయి కూడా ఒకే అంది. ఆరు నెలల్లో పెళ్లి అని తాంబూలాలు తీసుకున్నారు.

కట్ చేస్తే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది.. సురేందర్ పెళ్లి చూపుల్లో చూసిన అమ్మాయిని యుగందర్ ప్రేమిస్తున్నాడు. వారిద్దరూ మూడు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్నారు. చివరకు ఇంటికి వచ్చిన తర్వాత యుగంధర్ ఆమె ఫోటో చూసి ఈ విషయం అన్నయ్యకు ఎలా చెప్పాలి అని ఆలోచించాడు, మూడు రోజుల తర్వాత నేరుగా ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి అసలు విషయం తల్లిదండ్రులకి చెప్పాడు… దీంతో సురేందర్ ముందు బాధపడినా వారిద్దరికి ఇంజనీరింగ్ చదువు అయిన తర్వాత నేనే దగ్గర ఉండి పెళ్లి చేస్తా అని మాట ఇచ్చాడు,