తన బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన అంజలి

తన బ్రేకప్ పై క్లారిటీ ఇచ్చిన అంజలి

0

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి ..తూగో జిల్లాకు చెందిన అంజలి రాజోలు నుంచి సినిమాల్లోకి వచ్చింది ..మంచి అవకాశాలతో వరసగా సినిమాలు చేసింది. హిట్ సినిమాలు చేసి టాలీవుడ్ కోలీవుడ్ లో మంచి స్టార్ డమ్ సంపాదించింది.

అంజలి కోలీవుడ్ హీరో జై కొంత కాలం ప్రేమించుకుని, ఆ తరువాత విడిపోయారన్న వార్తలు ఆ మధ్య చాలా ఎక్కువగా వినిపించాయి. వీటి మీద ఈ ఇద్దరు పెద్దగా స్పందించలేదు. అసలు ఇది వాస్తవమా కాదా అనే విషయంలో కోలీవుడ్ మీడియా కూడా పలు సార్లు ప్రశ్నిద్దాము అనుకున్నా ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు.

తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది అంజలి.. మేం ఇద్దరం మంచి స్నేహితులం. ఇప్పటికీ, ఎప్పటికీ మేం స్నేహితులమే ఒక సమయంలో ఇద్దరం కలిసి ఎక్కువ సినిమాలు చేసిన మాట వాస్తవమే అయినా ఇప్పుడు చేయకపోవడానికి కారణం మేం విడిపోవడం కాదు. మంచి సినిమాలు రాక చేయడం లేదంతే అని తెలిపింది.. అంతేకాని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పింది అంజలి.