త‌న సినిమాలో ఆన‌టుడు ఉండాలి అంటున్న బాల‌య్య

త‌న సినిమాలో ఆన‌టుడు ఉండాలి అంటున్న బాల‌య్య

0

బాల‌య్య సినిమాలు అంటే అభిమానుల కోలాహ‌లం ఎలా ఉంటుందో తెలిసిందే, అయితే బాల‌య్య ఇప్పుడు బోయ‌పాటితో సినిమా చేస్తున్నారు.. లెజెండ్ సింహ లాంటి సూప‌ర్ హిట్ సినిమాలు ఇచ్చిన బోయ‌పాటి శ్రీనివాస్ ఇప్పుడు మ‌రో సూప‌ర్ హిట్ బాల‌య్య‌కు ఇచ్చేందుకు సిద్దం అయ్యారు అని తెలుస్తోంది.

ఇక బాల‌య్య అభిమానుల‌కి ఏం కావాలో అది బోయ‌పాటికి బాగా తెలుసు.. అందుకే ఈ సారి ద‌ర్శ‌కుడు చాలా స‌రికొత్త క‌థ‌తో ముందుకు వ‌స్తున్నార‌ట‌.ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనుండగా… ఫస్ట్ ఆఫ్ లోని కొన్ని నిమిషాలపాటు నెగటివ్ షేడ్స్ లో కనిపించనున్నారని టాలీవుడ్ టాక్ న‌డుస్తోంది.

అయితే ఇందులో ఇద్ద‌రు హీరోయిన్లు న‌టిస్తారు అని తెలుస్తోంది. శ్రియ, అంజలి ఇద్ద‌రిని తీసుకున్నార‌ని స‌మాచారం అందుతోంది.ఈ సినిమాలో ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఉంటుందట దానికోసం ఎవ‌రిని తీసుకోవాలి అని ఆలోచిస్తున్న స‌మ‌యంలో ఈ పాత్ర‌కి సీనియ‌ర్ న‌టుడు రావుర‌మేష్ చేస్తేనే బెట‌ర్ అని బాల‌య్య అన్నార‌ట‌.. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బాగా పాపులారిటీ సంపాదించిన రావు రమేష్ గ‌తంలో బాల‌య్య‌తో కూడా సినిమాలు చేశారు, ఈ సినిమాలో ఏప్రాత చేస్తారా అని అంద‌రూ ఎదురుచూస్తున్నారు.