తన కూతురు పవన్ పై పోస్ట్ పెట్టిన రేణూదేశాయ్

తన కూతురు పవన్ పై పోస్ట్ పెట్టిన రేణూదేశాయ్

0

పవన్ కల్యాణ్ సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ఫుల్ టైమ్ పాలిటీషియన్ అయ్యారు, ఇక ఆయన భార్య రేణుదేశాయ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత మూడో వివాహం చేసుకున్నారు, అయితే ఆయనకు రేణుతో కలిగిన సంతానం ఇద్దరు మాత్రం రేణూతోనే ఉన్నారు.

తన కూతురితో కలిసి పవన్ కల్యాణ్ దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేణుదేశాయ్..
పిల్లలకు అద్భుతంగా, అందంగా తమ తల్లిదండ్రుల పోలికలు వస్తాయి. ఒక్కోసారి ఆద్య నాలా కనపడుతుంది. చాలా సార్లు ఆమె తన నానమ్మ, నాన్నలా కనపడుతుంది. ఆమె నా కెమెరాలో ఫేవరెట్ పర్సన్ అని రేణూ దేశాయ్ తెలిపారు.అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని ఇటీవల షేర్ చేశారు.

అయితే పవన్ అభిమానులు మాత్రం దీనిపై తీవ్రమైన విమర్శలు చేశారు..ఆ పిల్లలది ఎంతైనా పవన్ రక్తం కదా? అని కామెంట్లు చేశారు. అయితే, వారికి రేణూ కౌంటర్ ఇస్తూ… సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి మరి ఇప్పుడు పవన్ లా తన కూతురు ఉంది అని పోస్ట్ పెట్టడం పై అభిమానులు ఇదేమిటి అని ప్రశ్నిస్తున్నారు.