తన తండ్రి చిరకాల కోరిక చెప్పిన వెంకటేష్

తన తండ్రి చిరకాల కోరిక చెప్పిన వెంకటేష్

0

విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో అందరి కంటే ముందు ఉన్నారు.. ఆయనే టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు ఎక్కువ చేసిన అగ్రనటుడు .. ఆయనతో సినిమా చేస్తే హిట్ అనే పేరు సంపాదించారు.. తాజాగా నాగచైతన్యతో కలిసి వెంకిమామ చిత్రంలో నటించారు.

ఈ సినిమా సూపర్ హిట్ అయింది ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా నచ్చింది ఈ చిత్రం, వెంకీమామ చిత్రంతో తన తండ్రి రామానాయుడు కోరిక నెరవేర్చానని హీరో వెంకటేశ్ తెలిపారు. అవును తాజాగా విజయవాడలో చిత్రం సక్సెస్ మీట్ నిర్వహించారు. అక్కడకు నాగచైతన్యతో కలిసి వెంకటేష్ వచ్చా.రు

ఈ సమయంలో పలు కీలక విషయాలు చెప్పారు వెంకటేష్.నేను చైతన్యతో కలిసి నటించాలన్నది తన తండ్రి రామానాయుడు కోరిక అని, ఈ సినిమాతో తండ్రి కోరిక తీర్చగలిగానని వెల్లడించారు. చైతన్యతోనే కాదని, ఇతర హీరోలతో కలిసి నటించేందుకు కూడా తనకు అభ్యంతరం లేదని వెంకీ స్పష్టం చేశారు, మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్,నాగచైతన్య, పవన్ కల్యాణ్ తో ఆయన మల్టీస్టారర్ లో చేశారు