దారుణం..మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన దుర్మార్గులు

0

మహిళలపై, చిన్నారులపై, దుండగుల అఘాయిత్యాలు రోజురోజుకు అధికం అవుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు, కఠిన చర్యలు తీసుకువస్తున్నా ఆడవారిపై జరిగే అఘాయిత్యాలకు మాత్రం అరికట్టలేకపోతున్నారు పోలీసులు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకోగా..తాజాగా మధ్యప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే ఓ బాలిక జీవితాన్ని అంధకారం చేసింది.

ఓ మైనర్ బాలికపై ఆమె స్నేహితులు ఇద్దరూ అత్యాచారం చేయడంతో పాటు..త్యాచారాన్ని తమ మరో స్నేహితుడికి చూపించడానికి లైవ్ స్ట్రీమింగ్ చేసిన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇటీవల బాధితురాలికి ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరగగా..ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బాలికను హెచ్చరించారు.

దాంతో ఆ దుర్మార్గులకు భయపడిన బాలిక తల్లిదండ్రులకు చెప్పలేదు. కానీ అంతలోనే అత్యాచార వీడియోను ఆమెతో నిశ్చితార్థం జరిగిన వ్యక్తికి పంపించగా..పెళ్లి ఆగిపోయింది. దాంతో తల్లిదండ్రులు తమ కూతురికి జరిగిన అన్యాయాన్ని చెప్పడానికి పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం పోలీసులు తల్లిదండ్రుల వివరాల మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here