ఆ అబ్బాయికి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు పెళ్లి చేసుకున్నారు కోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే

0
ప్రేమించుకోవడం  ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకోవడం… ఇప్పుడు చాలా ఘటనలు ఇలాంటివి మనం చూస్తున్నాం…అయితే చాలా మంది మైనార్టీ తీరకుండానే 18 ఏళ్లు  నిండకుండానే ఇలా వివాహం చేసుకుంటున్నారు.. ఇవి చెల్లని వివాహాలు అని తెలియచేస్తున్నారు పోలీసులు… అయితే తాజాగా ఓ కేసు గురించి వింటే షాక్ అవ్వాల్సిందే.
ఆ అబ్బాయికి 14 ఏళ్ళు.. అమ్మాయికి 16 ఏళ్ళు వీరిద్దరూ ప్రేమించుకున్నారు.. వీరి పెళ్లి అయితే చట్ట ప్రకారం చెల్లదు కాని
వీరిద్దరి పెళ్లి విషయంలో మాత్రం ధర్మాసనం మానవతా దృక్పథంతో సంచలన తీర్పు ఇచ్చింది.  బీహార్ లో ఈ కేసు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈ తీర్పును ఆధారంగా చేసుకుని ఏ రాష్ట్రంలోని కోర్టు దీనిని
అవలంబించకూడదని స్సష్టం చేసింది.
14 ఏళ్ల బాలుడు, 16 ఏళ్ల బాలిక ఇద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. అంతేకాదు వీరికి 8 నెలల బాబు ఉన్నారు, దీంతో మానవీయ కోణంలో కోర్టు తీర్పు వచ్చింది, ఎందుకు అంటే ఇక్కడ మూడు జీవితాలు ఆధారపడి ఉన్నాయి.
16 ఏళ్ల బాలిక మరియు 14 ఏళ్ల బాలుడి వివాహం చట్టబద్ధమైన వివాహం అని తేల్చి చెప్పింది కోర్టు. ఇక ఆ అబ్బాయిని జైలు నుంచి విడుదల చేశారు…ఆ 8 నెలల చిన్నారిని అతని తాత, నాయనమ్మల సంరక్షణలో ఉంచాలని ఆదేశించింది.  ఈ మైనర్ జంటను డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్లో ఉంచాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here