పిల్లల విషయంలో – కరోనా చికిత్సపై కేంద్రం కొత్త గైడ్ లైన్స్

the central govt new guidelines on corona treatment for children's

0

కరోనా వైరస్ థర్డ్ వేవ్. ఈ మాట ఇప్పుడు వణుకు పుట్టిస్తోంది. ఎందుకంటే ఇది పిల్లలపై ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు. దీంతో తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. ఇక థర్డ్ వేవ్ కు ఛాన్స్ ఇవ్వకూడదు అంటే, కచ్చితంగా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే ఇది నిపుణుల మాట.

తాజాగా చిన్న పిల్లలకు కరోనా చికిత్సపై, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ కీలక మార్గదర్శకాలను జారీచేసింది. అయితే ఈ సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ లో మనం చూశాం. కరోనా సోకిన వారికి ట్రీట్మెంట్లో భాగంగా రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు ధర్డ్ వేవ్ వస్తే, పిల్లలకు ఎట్టి పరిస్దితుల్లో ఈ ఇంజెక్షన్లు ఇవ్వద్దని తెలిపింది కేంద్రం.

పిల్లలకు కచ్చితంగా అవసరమైతేనే హై-రెజల్యూషన్ సీటీ స్కాన్ను తీయించాలని సూచించింది. అది కూడా తప్పదు అనుకునే కేసుల్లోనే. అలాగే ప్రతీ ఒక్కరికి సిటీ స్కాన్ వద్దు అని తెలిపింది. కచ్చితంగా పిల్లలకు జ్వరం వస్తూ తగ్గుతూ పలు కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వాలని .గదిలో పిల్లలు ఆరు నిమిషాల పాటు నడిచాక, పల్స్ ఆక్సీమీటర్ సాయంతో వారి ఆక్సిజన్ స్థాయిలు తెలుసుకోవాలని తెలిపింది. తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే ఆక్సిజన్ చికిత్స ప్రారంభించాలని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here