రైతులకు శుభవార్త..త్వరలో ఖాతాల్లో ఆ డబ్బు జమ

0

రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం వివిధ రకాల పథకాలకు శ్రీకారం చుట్టి అమలు చేసింది. ఈ పథకాల మీద ఆధారపడి బతికే రైతులు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో రైతు బంధు ఒకటన్న విషయం అందరికి తెలిసిందే.

ఈ పథకం కింద రైతులకు ప్రతీ ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ కొంతమేరకు ఆదుకుంటుంది. అయితే ఈ రైతుబంధు తీసుకునే రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది తెలంగాణ సర్కార్. ఎకారానికి వానాకాలం రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చేందుకు  నిధుల పంపిణీ అంశంపై అధికారులు దృష్టి పెట్టి రైతులకు వీలయినంత త్వరగా ఖాతాల్లో డబ్బులు జమచేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు.

అతి త్వరలోనే ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించిన రైతు బంధు నిధులు జమ అవుతాయని మంత్రి హరీష్‌ రావు ప్రకటించారు. అంతేకాకుండా  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నీ రకాల సౌకర్యాలు, మిషన్లు, పరికరాలు అన్నీ ఏర్పాట్లు చేశామని, ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులను సద్వినియోగం చేసుకోవాలని  మంత్రి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here