పసిడి ప్రియులకు శుభవార్త..భారీగా తగ్గిన బంగారం ధరలు

0

బంగారం ధరించడానికి అందరు ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా మహిళలు ఏ చిన్న కార్యక్రమం అయినా అధికంగా నగలు ధరిస్తూ తమ అందాన్ని మరింత పెంచుకుంటారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీసన్ కావడంతో బంగారం డిమాండ్ అధికంగా ఉంది. దాంతో మహిళలు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. కానీ అలా నిరాశ చెందేవారికి నేడు బంగారం అధికంగా తగ్గి చక్కని శుభవార్త చెప్పింది.

హైద‌రాబాద్ లో నేటి బంగారం, వెండి ధరలు ఇలా..

హైదరాబాద్ మార్కెట్‌ లో నేడు 10 గ్రాముల 24 కారెట్ల బంగారం రూ.400 వరకు తగ్గి రూ.50,290గా ప‌లుకుతుంది. ఒక్కసారే ధరలు తగ్గుముఖం పడడం మహిళకు ఆనందం పడే విషయమేనని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వెండి ధరలు విషయానికి వస్తే  కిలో వెండి ధర రూ.200 తగ్గడంతో రూ. 65,400 నమోదు అయింది. ఇది పసిడి ప్రియులు వచ్చే వారంలో కూడా ఇవే ధరలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ అదే గనుక జరిగితే బంగారం షాపులలో  గిరాకీ మాములుగా ఉండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here