కూతుర్ని లవ్ చేశాడని ఆమెతోనే పిలిపించి హత్య చేసిన తల్లిదండ్రులు

0
దారుణమైన ఘటన జరిగింది, యూపీలో మీరట్ లో  19 ఏళ్ల యువకుడ్ని దారుణంగా చంపేశారు, తమ కుమార్తెని ప్రేమించవద్దు అని వార్నింగ్ ఇచ్చినా ఇంకా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని ఆ యువకుడ్ని ఇంటికి పిలిచి మరీ హతమార్చారు.
మావానా ప్రాంతంలో యువకుడు డిగ్రీ చదువుతున్నాడు, అక్కడ ఓ యువతిని ప్రేమించాడు..ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు.
దీంతో ఆమె తల్లిదండ్రులు దీనిపై పంచాయతీ పెద్దలకు చెప్పారు, ప్రేమ వద్దని తమ కుమార్తెతో మాట్లాడవద్దు అని అతనికి వార్నింగ్ ఇచ్చారు …అందరి ముందు ఒప్పుకున్నాడు …ఇక అబ్బాయి పేరెంట్స్ కు కూడా అమ్మాయి తండ్రి వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి నా కుమార్తెతో మాట్లాడితే చంపేస్తాం అని.
అయితే ఇటీవల వారు ఇద్దరు మళ్లీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు.. ఈ విషయం ఆమె పేరెంట్స్ కు తెలిసింది.. కోపంతో రగిలిపోయారు.ఇంట్లో ఎవరూ లేరు. కలుద్దాం ఇంటిక రమ్మనమని తమ కుమార్తెతో ఫోన్ చేసి ప్రియుడ్ని వారి ఇంటికి పిలిపించారు. ఇక తలుపులు వేసి అందరూ కలిసి అతని పై దాడి చేశారు, చివరకు దెబ్బలు తాళలేక అతను మరణించాడు, ఆ యువకుడి బాడీని గోనెసంచిలో మూటకట్టి చెరువులో పడేశారు. దీంతో ఆమె తల్లిదండ్రులని  వారి బంధువులని అరెస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here