మనసులోని మాట బయటపెట్టిన స్టార్ హీరోయిన్..ఆ ముగ్గురు హీరోలతో..

The star heroine who revealed the word in her mind..with those three heroes ..

0

అందాల తార నిధి అగర్వాల్‌ సవ్యసాచి’ చిత్రంతో దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తన కెరీర్ లో మంచి పాత్రలు ఉన్న సినిమాలనే చేయడం ఈమె ప్రత్యేకత. ఇప్పటికే సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది నిధి.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో విజయం అందుకున్న తర్వాత నిధి అగర్వాల్‌కు వరుస అవకాశాలు వచ్చాయి.  శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశోక్‌ గల్లా, నిధి జంటగా నటించిన చిత్రం ‘హీరో’. కృష్ణ, గల్లా అరుణకుమారి సమర్పణలో గల్లా పద్మావతి నిర్మించిన ఈ చిత్రం  ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిధి అగర్వాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో డాక్టర్‌గా చేశాను. ఇప్పుడు ‘హీరో’ సినిమాలోనూ సుబ్బు అనే డాక్టర్‌ పాత్రే చేశాను. కానీ రెండింటికీ తేడా ఉంటుంది. రెండు కుటుంబాల మధ్య జరిగే డ్రామా ‘హీరో’. వినోదంతో పాటు కథలో కొన్ని ట్విస్ట్‌లు ఉన్నాయి. పాటలు కూడా బాగా వచ్చాయి. ఇది సంక్రాంతికి పర్‌ఫెక్ట్‌ మూవీ.

అలాగే తన మనసులోని మాట బయటపెట్టింది ఈ అమ్మడు. నాకిష్టమైన కెమెరామేన్‌ సమీర్‌ రెడ్డిగారితో పనిచేయడం హ్యాపీ. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ తర్వాత గ్లామర్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌లైన్‌ రావడాన్ని ఎంజాయ్‌ చేస్తున్నాను. నాకు యాక్షన్‌ పాత్రలంటే ఇష్టం. ‘హరిహర వీరమల్లు’లో యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయి. అల్లు అర్జున్, రామ్‌ చరణ్, ఎన్‌టీఆర్‌లతో నటించాలనుంది. ఓటీటీ కంటే సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇస్తా అని తెలిపింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here