దారుణం బస్సులో బాలికని అత్యాచారం చేసిన దుర్మార్గులు

The villains who brutally raped the girl on the bus

0

యూపీలో దారుణం జరిగింది. ఢిల్లీ నుంచి ఔరియాకు స్లీపర్ కోచ్ బస్సులో తల్లి కుమార్తె వెళుతున్నారు. ఈ సమయంలో బస్సు సిబ్బంది ఆ అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ బస్సులో ఉన్న సిబ్బంది పై ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. ఢిల్లీలో 30 ఏళ్ల మహిళ తన 14 ఏళ్ల కూతురుని, 18 ఏళ్ల వయసున్న మేనకోడలిని వెంటబెట్టుకుని కాన్పూర్ కు వెళ్లే ఏసీ స్లీపర్ బస్సు ఎక్కింది. యమునా ఎక్స్ ప్రెస్ హైవేపై బస్సు వెళుతోంది.

ఇక ఆ యువతి డ్రైవర్ వెనుక ఉండే స్లీపర్ బెర్త్ లో పడుకుంది. అయితే తల్లి వెనుక సీట్ల పడుకుంది ఈ సమయంలో బస్సులో పనిచేసే బబ్లూ, అన్షు అనే ఇద్దరు ఆమె క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఆమెను మద్యం తాగమని బలవంతం చేశారు. చివరకు ఆమె తాగలేదు ఆమె నోరు మూసి ఖాళీగా ఉన్న‌ మరో క్యాబిన్ లోకి తీసుకువెళ్లారు. ఆమె నోరు నొక్కి అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇక కొద్ది సేపటికి తల్లి చూస్తే వారి కుమార్తె కనిపించలేదు. ఈ స‌మ‌యంలో ఆమె కుమార్తె ఏడుస్తూ క్యాబిన్ నుంచి వచ్చింది. వెంటనే డ్రైవర్ ని బస్సు ఆపమంటే ఆపలేదు. ఇక బస్సులో ప్ర‌యాణికులు అందరూ లేచి డ్రైవర్ ని నిలదీస్తే బస్సు ఆపాడు. చివరకు ఆ ఇద్దరు బస్సు ఆగగానే దిగి పారిపోయారు. నేరుగా పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఆ యువతి త‌ల్లి. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here