అక్కడ ఎలుకలు – సాలీడులతో ఇబ్బంది భయపడిపోతున్న జనం

0

ఆస్ట్రేలియా లో ఇప్పుడు కరోనా కేసులు దారుణంగా బయటపడుతున్నాయి, అలాగే వర్షాలు వరదలతో జనం ఇబ్బంది పడుతున్నారు.. అయితే ఇక్కడ మరో సమస్య అందరినీ వేధిస్తోంది.. ఇలా ఉంటే ఆ దేశానికి మరో సమస్య వచ్చింది.ఎలుకలు, సాలీడు రూపంలో వచ్చింది.. అవును ఇటీవల అక్కడ ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది, ఇక చాలా రెస్టారెంట్లు షాపుల్లో వీటి బాధ ఎక్కువ అయింది అంటున్నారు.

అంతేకాదు చాలా నష్టాలు వస్తున్నాయట.. ఆస్ట్రేలియాలోని తూర్పు రాష్ట్రాలలో కొన్ని మిలియన్ల ఎలుకలు రోడ్డు మీద కనిపిస్తున్నాయి, అంతేకాదు జనాన్ని ఇవి కొరుకుతున్నాయి. ఇళ్లల్లో పంటల్లో షాపుల్లో ఉన్నఆహార పదార్ధాలను తినేస్తున్నాయి. ఇక చాలా మంది ఈ ఎలుకలు పట్టే పనిలో ఉన్నారు.

ఇక సిడ్నీ వంటి ప్రాంతాల్లో ఎలుకలతో పాటు అరక్నిడ్ సాలీళ్లు కూడా ఇళ్లల్లో ఇబ్బంది పెడుతున్నాయి, ఇవి చాలా డేంజర్ సాలీడ్లు, ఇవి కరిస్తే మరణించే ప్రమాదం ఉంది అంటున్నారు, మొత్తానికి ఈ సమస్య ఆ దేశంలో ప్రజలను చాలా ఇబ్బంది పెడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here