తిరుమ‌లపై ఈ ప్ర‌చారం న‌మ్మ‌కండి – తితిదే క్లారిటీ

తిరుమ‌లపై ఈ ప్ర‌చారం న‌మ్మ‌కండి - తితిదే క్లారిటీ

0

దేవ‌దేవుడు అఖిలాండ కోటి బ్ర‌హ్మండ‌నాయ‌కుడు ఆ వెంక‌న్న, ఆయ‌న కొలువై ఉన్న తిరుమ‌ల ఆల‌యంలో భ‌క్తులు తాకిడి లేదు, దాదాపు నెల రోజులుగా లాక్ డౌన్ తో వెంక‌న్న ద‌ర్శ‌నం భ‌క్తుల‌కి లేదు అనే చెప్పాలి. అయితే లాక్ డౌన్ ఎత్తివేసిన త‌ర్వాత అలాగే వైర‌స్ తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత మాత్రమే తిరుమ‌ల‌లో భ‌క్తుల తాకిడి ఉంటుంది అంటున్నారు.

అయితే వైర‌స్ తీవ్ర‌త త‌గ్గిన త‌ర్వాత లాక్ డౌన్ తీసిన త‌ర్వాత మాత్రమే తితిదే భ‌క్తుల ద‌ర్శ‌నం గురించి ఓ నిర్ణ‌యం తీసుకుంటుంది, కాని తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌చారం స్టార్ట్ అయింది.
తిరుమల శ్రీ వారి ఆలయంలో జూన్ 30 వతేదీ వరకు.. భక్తులకు దర్శనం నిలిపి వేయాలని నిర్ణయం తీసుకున్నారు అని వార్త వైర‌ల్ అవుతోంది.

దీంతో దీనిపై తితిదే అధికారులు క్లారిటీ ఇచ్చారు, ఇది వాస్త‌వం కాదు అని తెలిపారు. దీనిపై ధర్మకర్తల మండలి సకాలంలో తగు నిర్ణయం తీసుకుంటుందని భ‌క్తుల ద‌ర్శనంపై ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు అన్నారు. ఇలాంటి అస‌త్య వార్త‌లు ప్ర‌చారం చేస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటాం అన్నారు. లాక్ డౌన్ త‌ర్వాత మాత్ర‌మే దీనిపై నిర్ణ‌యం తీసుకుంటుంద‌ట‌ తితిదే బోర్డ్.