తిన‌డానికి అన్నం లేక‌పోవ‌డంతో వీరు ఏం తిన్నారో తెలిసి కేసు పెట్టిన పోలీసులు

తిన‌డానికి అన్నం లేక‌పోవ‌డంతో వీరు ఏం తిన్నారో తెలిసి కేసు పెట్టిన పోలీసులు

0

దేశంలో లాక్ డౌన్ అమ‌లు అవుతోంది, దీంతో ఎవ‌రూ బ‌య‌ట‌కు రాని ప‌రిస్దితి… అంద‌రూ ఇంటికి ప‌రిమితం అయ్యారు, అయితే కొంద‌రికి పేద‌ల‌ను గుర్తించి కేంద్రం అలాగే స్టేట్ ప్ర‌భుత్వాలు వారికి రేష‌న్ అందిస్తున్నాయి.. కొంద‌రికి అందుతున్నాయి మ‌రికొంద‌రికి అంద‌టం లేదు.. వ‌ల‌స కార్మికుల‌కి కూడా ఇదే ఇబ్బంది ఇప్పుడు వ‌చ్చింది.

అయితే అన్నం వండుకునేందుకు బియ్యం నిండుకోవడంతో, అడవిలోకి వెళ్లి, భయంకరమైన విషసర్పంగా పేరున్న కింగ్ కోబ్రాను చంపి తెచ్చి, వండుకుని తిన్నారు కొందరు. అంతేకాదు ఈ దారుణం వీడియో తీశారు దీనిని సోషల్ మీడియాలో పెట్ట‌డంతో ఈ వీడియో వైరల్అయింది.

వీరి వీడియోతో వెంట‌నే 12 గంట‌ల్లో స్పందించిన అధికారులు, వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు… కింగ్ కోబ్రా అనేది మన దేశీయ‌ చట్టం ప్రకారం రక్షిత సర్పం… ఈ నేరానికి వారికి బెయిల్ కూడా రాదు.ఇది సుమారు 12 అడుగులుపొడ‌వు ఉంది.. ఈ ఘ‌ట‌న‌ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ లో జ‌రిగింది.