గంగవ్వ సొంత ఇంటి నిర్మాణం ఎందుకు వెనక్కి వెళుతోంది – కారణం ఇదే

0

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో అందరూ కొత్తవారే, అంతేకాదు ఈసారి సరికొత్తగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ ని, సుమారు 50 రోజులు పూర్తి చేసుకుంది బిగ్ బాస్, అయితే గంగవ్వ హౌస్ నుంచి వెళ్లిపోవడం ఎవరికి నచ్చలేదు కాని ఆమె అనారోగ్య కారణాలతో హౌస్ ని వీడింది, అయితే ఆమె హౌస్ ని వీడే సమయంలో కూడా ఆమె సొంతింటి కల నెరవేరుస్తాము అని బిగ్ బాస్ అలాగే నాగార్జున కూడా తెలిపారు.

అయితే ఆమె ఇంకా ఇంటి పనులు మొదలు పెట్టలేదు, దీంతో చాలా మంది షాక్ అవుతున్నారు, ఆమె ఎందుకు ఇంటి పనులు మొదలు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.. అయితే బిగ్ బాస్ షో నుంచి ఇంకా ఆమెకి నగదు రాలేదు అంటున్నారు, ఆ నగదు వచ్చిన తర్వాత మాత్రమే ఆమె ఇంటి పనులు మొదలుపెడతారట.

ఆమె ఇటీవలే మీడియాతో మాట్లాడుతూ.. బిగ్బాస్ అనుమతిస్తే.. దసరా రోజున ఇళ్లు కట్టుకోవడానికి ముగ్గు పోసుకొంటానని చెప్పింది. అయితే దసరా రోజున సొంతింటి కలను సాధ్యం చేసుకుందామని అనుకున్న గంగవ్వ ఆశలు నెరవేరలేదు, అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి, బిగ్ బాస్ షో పూర్తి అయిన తర్వాత మాత్రమే ఈ నగదు వస్తుంది అంటున్నారు అనలిస్టులు, సో మరో 50 రోజులు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here