మూడు రాజధానులపై తెలంగాణ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యాలు

మూడు రాజధానులపై తెలంగాణ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యాలు

0

ఏపీలో మూడు రాజధానుల రగడ కొనసాగుతోంది… అభివృద్ది వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని వైసీపీ నాయకులు అంటున్నారు… రాజధాని అమరావతి ఇష్టం లేక వైసీపీ సర్కార్ తరలిస్తోందని విమర్శలు చేస్తోంది టీడీపీ…

ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసరావు మూడు రాజధానుల గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్మించి ఉంటే మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చేదికాదని అన్నారు…

ప్రజలకు బాహుబలి గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని అన్నారు… ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులను నిర్మించడం మంచిదేనని అన్నారు.. తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లు రానున్న రోజుల్లో ఏపీలో కూడా టీడీపీ కనుమరుగైతుందని తలసాని శ్రీనివాస రావు తెలిపారు…