ఏపీలో కలకలం మరో టీడీపీ నేత అరెస్ట్

ఏపీలో కలకలం మరో టీడీపీ నేత అరెస్ట్

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీనేతల పై అక్రమ అరెస్ట్ లు కొనసాగుతూనే ఉన్నారు.. మొన్న పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్…. నిన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తిలిసిందే.

ఇక ఇదే క్రమంలో తాజాగా కర్నూల్ జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు… ఆయన అరెస్ట్ తో నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది…హైదరాబాద్ లో ఉన్న ఓ మద్యంషాపులో తిక్కారెడ్డి భాగస్వామిగా ఉన్నారు… ఈ పరిశ్రమకోసం ముడిసరుకుని రైతునుంచి కొనుగోలు చేశారు..

అయితే ఇందుకు సంబంధించిన డబ్బు తనకు 12 కోట్లు రావాలని రైతు బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి తిక్కారెడ్డిని అరెస్ట్ చేసేందుకు మంత్రాలయంకు వెళ్లారు అక్కడ స్థానిక పోలీసుల సహాయంలో ఆయన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకువచ్చారు