తిరుమల కిటకిట..కొనసాగుతున్న భక్తుల రద్దీ

0

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి దేశవిదేశాల నుండి భక్తులు అధికసంఖ్యలో తరలివస్తున్న క్రమంలో భక్తులు టికెట్లను బుక్‌ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో భక్తులు  కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతున్న తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వద్దకు తండోపతండాలుగా తరలివస్తున్నారు.  దాంతో తిరుమల పరిసరప్రాంతాల్లో ఉండే కాంప్లెక్స్‌లు నిండిపోయి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దీన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు అన్నప్రసాదం, తాగు నీరు, చంటి పిల్లల కోసం పాలు ఇవ్వడం వంటి ఆర్థిక సహాయాలు చేస్తున్నారు. 89,665 భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 35,794 మంది తలనీలాలు సమర్పించినట్టు టిటిడి వెల్లడించింది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీ ఆదాయం రూ. 3.98 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here