తెలంగాణలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు : నేటి లిస్ట్ ఇదే

Today Telangana Corona Cases Updates

0

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోలిస్తే గురువారం స్వల్పంగా పెరిగింది. నేడు వెల్లడైన బులిటెన్ లో వివరాలు ఇవీ. తెలంగాణలో బుధవారం 1489 కేసులు నమోదు కాగా ఇవాళ 1492 కేసులు నమోదయ్యాయి. మరణాల సంఖ్య నిన్నటితో పోలిస్తే పెరిగింది. బుధవారం 11 మరణాలు సంభవించగా గురువారం 13 మరణాలు చోటు చేసుకున్నాయి. జిల్లాల వారీగా చూస్తే ఎప్పటిలాగే మూడు జిల్లాల్లో త్రిబుల్ డిజిట్ కేసులున్నాయి. జిహెచ్ఎంసి, ఖమ్మం, నల్లగొండ లలో త్రిబుల్ డిజిట్ కేసులు నమోదు కాగా ఆదిలాబాద్, కామారెడ్డి, కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నారాయణపేట, నిజామాబాద్ జిల్లాల్లో సింగిల్ డిజిట్ నమోదయ్యాయి. మిగతా జిల్లాలన్నీ డబుల్ డిజిట్ తో ఉన్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం ఒక కేసు మాత్రమే నమోదైంది.
రాష్ట్రంలో ఇవాళ పరీక్షలు 1,19,464 జరిపారు. కోవిడ్ సోకి ఇవాళ కోలుకున్న వారి సంఖ్య 1933 గా ఉంది. రాష్ట్రంలో యాక్టీవ్ కేసుల సంఖ్య 19521 మాత్రమే ఉన్నాయి. వెయిటింగ్ లో ఉన్న టెస్టుల సంఖ్య 1346.
గురువారం నాడు జారీ అయిన బులిటెన్ లో జిల్లాల వారీగా కేసుల వివరాల జాబితా కింద ఉంది చూడొచ్చు.
ఆదిలాబాద్ 3 కేసులు
కొత్తగూడెం 91
జిహెచ్ఎంసి 166
జగిత్యాల 26
జనగామ 14
జయశంకర్ భూపాలపల్లి 25
జోగులాంబ గద్వాల 15
కామారెడ్డి 6
కరీంనగర్ 92
ఖమ్మం 129
కొమరం భీం ఆసిఫాబాద్ 1
మహబూబ్ నగర్ 29
మహబూబాబాద్ 67
మంచిర్యాల 49
మెదక్ 13
మేడ్చల్ మల్కాజ్ గిరి 83
ములుగు 31
నాగర్ కర్నూల్ 16
నల్లగొండ 115
నారాయణపేట 9
నిర్మల్ 7
నిజామాబాద్ 8
పెద్లపల్లి 59
రాజన్న సిరిసిల్ల 28
రంగారెడ్డి 92
సంగారెడ్డి 18
సిద్దిపేట 53
సూర్యాపేట 89
వికారాబాద్ 19
వనపర్తి 27
వరంగల్ రూరల్ 20
వరంగల్ అర్బన్ 65
యాదాద్రి భువనగిరి 27

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here