పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరో, హీరోయిన్?

Tollywood hero, heroine to be married?

0

మరో టాలీవుడ్ హీరో, హీరోయిన్ పెళ్లి పీటలెక్కబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. వరుణ్ తన పుట్టినరోజు సందర్భంగా 25 లక్షల విలువ చేసే డైమండ్ రింగ్ పట్టుకొని బెంగళూరులో ఉన్న లావణ్య త్రిపాఠి వద్దకు వెళ్లారంటూ కూడా జోరుగా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి.

ఓ ఇంటర్వ్యూలో వరుణ్ సోదరి నిహారిక ఇండస్ట్రీలో నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటూ ప్రశ్నించగా లావణ్యత్రిపాఠి అని సమాధానమిచ్చింది. అదేవిధంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కలిసి రెండు సినిమాల్లో నటించారు. అందులో మిస్టర్ సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే లావణ్య త్రిపాఠితో రెండు సినిమాలు చేయడం వల్ల ఏర్పడిన పరిచయం కొంత కాలానికి ప్రేమగా మారింది అంటూ ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే నిహారిక వివాహానికి కేవలం మెగా ఫ్యామిలీ తో పాటు ఆమె భర్త కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. కానీ ఈ వివాహ వేడుకలో నటి లావణ్య త్రిపాఠి సందడి చేయడం ఆసక్తికరంగా మారింది. అదేవిధంగా కేవలం మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో దిగారు. అయితే ఆ ఫోటోలో లావణ్య త్రిపాటి ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే లావణ్య త్రిపాటి వరుణ్ తేజ్ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలను అటు వరుణ్ టేజ్ కానీ ఇటు లావణ్య త్రిపాఠి కానీ ఖండించలేదు.  లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతుందా లేదా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here