వైసీపీలోకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్

వైసీపీలోకి టాలీవుడ్ స్టార్ హీరోయిన్

0

ఏపీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కావాల్సినంత సినీ గ్లామ‌ర్ ఉండ‌గా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సినీ గ్లామ‌ర్ చాలా త‌క్కువ‌నే చెప్ప‌వ‌చ్చు .న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజా, పృద్వి, అలీ, పోసానికృష్ణ మురళిలు త‌ప్పితే వైసీపీకి సినీ గ్లామ‌ర్ అంత‌గా లేదు. ఈ క్ర‌మంలో ముఖ్యమంత్రి ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సినీ గ్లామ‌ర్ పై ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను వైసీపీలోకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల‌ను ప్రారంభించిన‌ట్లు మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో అప్ప‌ట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పేరొందిన ప్రముఖ హీరోయిన్ వైసీపీలోకి రానున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్రస్తుతం ఆమె వైసీపీలో చేరేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల క్రితం జ‌గ‌న్ నివాసం లోట‌స్ పాండ్ కు వ‌చ్చిన ఆయనను క‌లిసి వెళ్లిపోనట్లు తెలుస్తోంది. దీంతో ఆమె వైసీపీలో చేర‌తార‌నే వార్త‌లు పుట్టుకోస్తున్నాయి.అంతేకాదు ఆమె వైసీపీ ఎంట్రీకి జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని , వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌నే ప్ర‌చారం జోరుగా జ‌రుగుతోంది..