డైరెక్టర్ బాబీకి గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

0

మెగాస్టార్ చిరంజీవి ఎంతో కష్టపడి స్వయంకృషితో పైకి వచ్చిన స్టార్ హీరో. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఆయన ఖాతాలో ఉన్నాయి. ఆయన సినిమా వస్తోంది అంటే ఎన్ని అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటి యంగ్ డైరెక్టర్లు పరిశ్రమలోకి వస్తున్న చాలా మంది నూతన దర్శకులు చిరుతో సినిమా చేయాలి అని కోరికతో ఉంటారు. వీలు అయితే ఆయనకు కథ వినిపించాలి అని చూస్తారు.

అయితే మెగాస్టార్ కూడా ఇప్పుడు చాలా మంది దర్శకులకి ఒకే చెబుతున్నారు. వారి కథలు వింటున్నారు.మెగాస్టార్ చిరంజీవి కష్టాన్ని నమ్ముకున్న వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటారు.
దర్శకుడు బాబీని చిరంజీవి మనస్ఫూర్తిగా అభినందించారు. దర్శకుడు బాబీ పుట్టినరోజున మెగాస్టార్ ను కలిసి ఆశీస్సులు అందుకోవాలని నిర్ణయించుకున్నారు. మెగాస్టార్ ని కలిశారు.

దర్శకుడికి బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి. బాబికి ఓ పెన్ ను కానుకగా ఇచ్చారు. దీంతో ఎంతో ఆనందించారు బాబి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
మీ నుంచి అందుకున్న గిఫ్ట్ నాకెంతో ప్రత్యేకం సర్ మీకున్న కోట్లాదిమంది ఫ్యాన్స్ లో నేనూ ఒకడ్ని. ఇప్పుడు మిమ్మల్ని డైరెక్ట్ చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీతో సినిమా చేయాలి అనే నా కల నిజమైంది అని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here