మేడ్చల్ లో విషాదం..రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

0

నేడు హైదరాబాద్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారని ఇద్దరు సూసైడ్ చేసుకున్న ఘటన మరవకముందే తెలంగాణాలో రైలు కిందపడి మరో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే..ఘట్​కేసర్ రైల్వే స్టేషన్ యంనంపేట ట్రాక్​పై రైలు కింద పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్ జిల్లాలో  చోటుచేసుకుంది. దాంతో అక్కడ ఉన్న స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమజంట ఆత్మహత్యకు గల కారణాలేంటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here