పెళ్లిపై త్రిష క్లారిటీ అక్కడే చేసుకుంటా

పెళ్లిపై త్రిష క్లారిటీ అక్కడే చేసుకుంటా

0

త్రిష ఎవర్ గ్రీన్ హీరోయిన్ అనే చెప్పాలి, అయితే ఆమె సినిమాల జోరు తగ్గినా టాలీవుడ్ లో కోలీవుడ్ లో ఆల్ మోస్ట్ సీనియర్ హీరోలు అందరితో ఆమె నటించింది.. కాని మళ్లీ తన సినిమాల జోరు పెంచింది.. ఇటు చిరంజీవి మొదలు యంగ్ హీరోలు అందరితో ఆమె నటించింది, అయితే ఆమె తాజాగా మూడు సినిమాలు చేస్తున్నారు, ఇక బిజీ బిజీగా ఉన్న ఆమె పెళ్లి ఎప్పుడు అనే వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తూనే ఉన్నాయి.

ఇటీవల తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన హీరోయిన్ త్రిష, తనకు ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు చెప్పింది. తనకు కూడా కొన్ని కలలు ఉన్నాయని చెప్పింది, అంతేకాదు వివాహ వ్యవస్థపై తనకు నమ్మకం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది త్రిష. అంతేకాదు ఇప్పటి వరకూ తనకు నచ్చిన మగాడు లేడు, ఒకవేళ దొరికితే కచ్చితంగా వెగాస్ లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. దీంతో ఆమె పెళ్లి ప్లేస్ కూడా ఫిక్స్ చేసుకుంది అంటున్నారు అభిమానులు.

తన డ్రీమ్ లిస్ట్ లో ఉన్న క్రేజీ డ్రీమ్ అని చెప్పింది…. ప్రస్తుతం మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియిన్ సెల్వన్, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం, మోహన్ లాల్ తో రామ్ సినిమాలతో బిజీగా ఉంది త్రిష, ఇక తాజాగా మరి కొన్ని సినిమా కథలు కూడా వింటోంది ఆమె…త్రిష మాత్రం టాలీవుడ్ లో మోస్ట్ సీనియర్ నటి అంటారు. ఎందుకంటే వరుసగా బిజీ బిజీగా అందరు హీరోలతో ఆమె సినిమాలు చేసింది.