టీఆర్ఎస్ ఎంపీకి కృతజ్ఞతలు చెప్పిన హీరోయిన్ రకుల్…. ఎందుకంటే

టీఆర్ఎస్ ఎంపీకి కృతజ్ఞతలు చెప్పిన హీరోయిన్ రకుల్.... ఎందుకంటే

0

తెలంగాణ అధికార టీఆర్ఎస్ పార్టీ ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపింది టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్… గతంలో హీరో నాగచైతన్య మొక్కను నాటి విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను రకుల్ స్వీకరించింది….

తాజాగా ఆ ముద్దుగుమ్మ మొక్కను నాటి వాటికి నీళ్లు పోస్తూ ఫోటోను దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది… అయితే తాను నటులకి ఛాలెంజ్ చేయబోనని తన ఫ్యాన్స్ అందరికీ ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పింది రకుల్… ప్రతీ ఒక్కరు మూడు మొక్కలు నాటాలని తెలిపింది…

కాగా ఎంపీ సంతోష్ కుమార్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఓ ఉద్యమంలా ముందుకు వెళ్తోన్న సంగతి తెలిసిందే… మొక్కలు నాటడంలో హీరో హీరోయిన్లు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు… తనకు ఈ అవకాశం కల్పించిన ఎంపీ సంతోష్ కుమార్ కు కృతజ్ఞతలు అని తెలిపింది రకుల్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here