ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం- భార‌తీయుల‌కి నో ఎంట్రీ

ట్రంప్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం- భార‌తీయుల‌కి నో ఎంట్రీ

0

క‌రోనా వైర‌స్ అమెరికాలో అతి దారుణంగా వ్యాప్తి చెందుతోంది. అగ్ర‌రాజ్యం చిగురుటాకులా వ‌ణుకుతోంది.. ఈ స‌మ‌యంలో నిరుద్యోగిత కూడా అమెరికాలో పెరుగుతోంది అనే భ‌యం అక్క‌డ చాలా మందికి క‌లుగుతోంది. ఇక తాజాగా అమెరికాలో ఓ సంచ‌ల‌న నిర్ణ‌‌యం తీసుకున్నారు..

తమ దేశంలోకి వలసల్ని ఇమ్మిగ్రేషన్ తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఓ ప్రకటన చేశారు. త్వరలో దీనికి సంబంధించిన ఉత్తర్వులపై సంతకం చేయనున్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు.

ఈ వైర‌స్ తో ఆర్ధిక వ్య‌వ‌స్ధ కూడా చాలా దెబ్బ తింది, అలాగే పౌరుల‌కి కూడా చాలా ఇబ్బందులు వ‌చ్చాయి. ఉద్యోగాలు చాలా మంది కోల్పోవ‌డంతో వారిని ర‌క్షించాలి కాబ‌ట్టి వల‌స‌ల్ని అమెరికాలోకి అనుమ‌తించం అని చెబుతున్నారు, దీంతో ఇప్ప‌డు విదేశీయులు ఉద్యోగాలు చేసేందుకు అమెరికా వెళ్లేందుకు అవ‌శాశం లేదు, ఇక్క‌డ‌కు భారతీయులు చైనా వారు ఎక్కువ ఉద్యోగాల‌కు వెళ‌తారు వారికి పెద్ద స‌మ‌స్య అనే చెప్పాలి.. కరోనాతో 42,560 మంది మరణించారు. అలాగే పాజిటివ్‌ కేసుల సంఖ్య దాదాపు ఎనిమిది లక్షలకు చేరువైంది. అందుకే ట్రంప్ ఇలాంటి క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు.