తిరుమల భక్తులకు టీఎస్ఆర్టీసీ తీపికబురు

0

తిరుమల వెళ్లాలనుకునే తెలంగాణ భక్తులకు టీఎస్ఆర్టీసీ తీపికబురు చెప్పింది. తిరుమలకు వెళ్లే వారికి బస్ టికెట్‌తోపాటే దర్శనం టికెట్‌ను కూడా బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ. ఈ మేరకు టీటీడీతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇవాళ్టి నుంచి ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఒ ప్రకటనలో తెలిపారు.తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తో టీఎస్ఆర్టీసీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుందని.. ప్రతీ రోజు 1000 టికెట్లు అమ్ముతామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా ఆథరైజ్డ్ డీలర్ ద్వారా వారం రోజుల ముందుగా బస్ టికెట్ బుక్ చేసుకునే వాళ్లు.. ప్రత్యేక దర్శనం టికెట్ కూడా తీసుకోవచ్చు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతీ డిపో నుంచి తిరుపతికి బస్సు సౌకర్యం ఉన్నది. కేవలం తెలంగాణ వాసులే కాకుండా.. సరిహద్దులో ఉన్న ఆంధ్రా ఊర్ల నుంచి వెళ్లే వారు కూడా తెలంగాణ ఆర్టీసీ టికెట్లు బుక్ చేసుకుంటే ఈ పథకం వర్తించనున్నది. ఇక టీఎస్ఆర్టీసీ-పోస్టల్ శాఖ మధ్య కూడా ఒక ఒప్పందం జరిగిందని ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here