ట్విట్టర్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి లేదంటే అంతేసంగతులు

ట్విట్టర్ ను వెంటనే అప్ డేట్ చేసుకోండి లేదంటే అంతేసంగతులు

0

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి సోషల్ మీడియాతో కనెక్షన్ ఉంటుంది… ఫేస్ బుక్, వాట్సప్, అలాగే ట్విట్టర్ ఈమూడింటితో నెటిజన్లు ఎక్కువ సమయం గడుపుతుంటారు… ముఖ్యంగా సెలబ్రెటీలు ట్విట్టర్ లో ఎక్కువ సమయం గడుపుతుంటారు…

అయితే నెటిజన్లు ట్విట్టర్ ఓపెన్ చేగానే అప్ డేట్ చెయండని నోటీఫికేషన్ అడుగుతుంది.. వీరికి పనీ పాట లేదు అస్తమాను అప్ డేట్ చేయమని చెబుతుంటారని మనలో మనం అనుకుంటాము… సహజంగా ప్రతీ ఒక్కరికీ ఆలోచన అలానే ఉంటుంది.. అయితే ఈ సారి అలా ఆలోచించకండి కచ్చితంగా మీ ట్విట్టర్ యాప్ ను అప్ డేట్ చేసుకోవాలంట…

ఈ విషయాన్ని ట్విట్టర్ యాజమాన్యమే చెప్పింది… లేదంటే పబ్లిక్ గా ఉంచిన మీ డేటా హ్యాకర్లు హ్యాక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు… అందుకే వెంటనే అప్ డేట్ చేయాలని అంటున్నారు… అప్ డేట్ చేసిన తర్వాత కొత్తవ వెర్షన్ వస్తుందని అంటున్నారు…