ఉదయ్ కిరణ్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్

ఉదయ్ కిరణ్ బయోపిక్ పై క్లారిటీ ఇచ్చిన సందీప్ కిషన్

0

టాలీవుడ్ లో ఈ మధ్య బయోపిక ఫీవర్ నడుస్తోంది, అయితే రెండు రోజులుగా ప్రముఖ నటుడు ఉదయ్ కిరణ్ గురించి ఆయన బయోపిక్ తెరపైకి రానుంది అని వార్తలు షికారు చేశాయి..సందీప్ కిషన్ పేరు కూడా ఈ చిత్రంలో ఉదయ్ పాత్ర చేస్తున్నాడు అని వినిపించింది.. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు సందీప్ . బయోపిక్ కు సంబంధించి ఎవ్వరూ నన్ను సంప్రదించలేదు. అంతేకాదు, ప్రస్తుతానికి బయోపిక్స్ చేసే ఆలోచన కూడా నాకు లేదు. అంటూ ఉదయ్ కిరణ్ బయోపిక్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు సందీప్ కిషన్.

అయితే ఇలా వెంటనే రియాక్ట్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు సినిమా పెద్దలు. ఉదయ్ కిరణ్ ను అల్లుడిగా చేసుకోవడానికి చిరంజీవి గతంలో ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అవన్నీ బయోపిక్ లో ఉండబోతున్నాయట. అందుకే ఇలాంటి చిత్రంలో చేస్తే మెగా ఫ్యామిలీకి దూరం అవ్వాలి అని భావించాడు సందీప్ , అందుకే వద్దు అనుకున్నాడట, మెగా ఫ్యామిలీతో వివాదాలు పెట్టుకోవడం ఎందుకు అని, ఈ చిత్ర అవకాశం వచ్చినా పక్కన పెడుతున్నాడట సందీప్ కిషన్.