ఉలుకూ పలుకు లేకుండా ఉన్న ఆ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు

ఉలుకూ పలుకు లేకుండా ఉన్న ఆ జిల్లా టీడీపీ సీనియర్ నేతలు

0

మన దేశంలో, రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది… పట్టణాలకే కాదు ఈ మహమ్మారి దాటికి ప్రతి పల్లె తల్లడిల్లుతోంది… కోవిడ్ కు ప్రతి గుండె అల్లాడుతోంది… ఈ కీలకమైన సమయంలో సేవకు ముందుకు వచ్చిన వారే నాయకులు అధికార పక్షంగా వైసీపీ ఎటూ తప్పని భాద… బాధ్యత ఇది…

కానీ ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం విమర్శలు వస్తున్నాయి… ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ నాయకులపై విమర్శలు ఎక్కువగా ఎస్తున్నాయి… ఈ జిల్లాలో ఒక్క కరోనా పాజిటివ్ లేకున్నా కూడా జిల్లాలో ఒక్క నాయకుడు కూడా పర్యటించకున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు…

దశాబ్దాల రాజకీయ జీవితాన్ని జనంతో కలసి పండించుకున్న మాజీ మంత్రులు సీనియర్ నేతలు ఇప్పుడు ఉలుకూ పలుకు లేకుండా ఉన్నారిని పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు… ప్రస్తుతం టీడీపీ సీనియర్లందరు స్వియ నిర్భందంలోకి వెళ్లిపోయారు… పార్టీ కార్యకర్తలు ప్రజలు ఏమైపోతేనేం అన్న తీరుగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు…