చరణ్ ను రూ. 5 కోట్లు అడుగుతున్నారు..

చరణ్ ను రూ. 5 కోట్లు అడుగుతున్నారు..

0

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూ. 5 కోట్లు ఇవ్వాల్సిందే అంటున్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబానికి చెందిన సభ్యులు. మెగా స్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నరసింహారెడ్డి స్వస్థలం కర్నూలులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారట.

అది కూడా నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పంట పొలాల్లోనే చేశారు. షూటింగ్ సమయంలో పొలాలు బాగా దెబ్బతిన్నాయని, పైగా తమ కుంటుంబానికి చెందిన వ్యక్తి జీవితంతో సినిమా తీస్తున్నారు కాబట్టి నిర్మాత చరణ్ 5 కోట్లు చెల్లించాలని నరసింహారెడ్డి కుటుంబ సభ్యులు చరణ్ ను డిమాండ్ చేస్తున్నారు. సైరా చిత్ర యూనిట్ వారి వాదనలపై సానుకూలంగా స్పందించారు. తప్పకుండ చరణ్ మీకు న్యాయం చేస్తాడని వారికీ చెప్పినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం చిత్ర షూటింగ్ అంత పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. దసరా కానుకగా అక్టోబర్ 02 న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరాబోతున్నారు.