వచ్చే సంక్రాంతికి త్రివిక్రమ్ సినిమా ప్లాన్ -ఆహీరోతో పెద్ద ప్రాజెక్ట్

వచ్చే సంక్రాంతికి త్రివిక్రమ్ సినిమా ప్లాన్ -ఆహీరోతో పెద్ద ప్రాజెక్ట్

0

ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్నారు ఎన్టీఆర్, ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది మేలో పూర్తి చేయాలి అని జక్కన్న ప్లాన్ చేస్తున్నారు, అయితే విడుదల పై అనేక డేట్స్ మళ్లీ వినిపిస్తున్నాయి.. కాని చిత్ర యూనిట్ నుంచి ఇంకా వార్త రావాల్సి ఉంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అరవింద సమేత తరువాత చేస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ … తాజాగా ఈ సినిమా అయిన తర్వాత మళ్లీ దర్శకుడు త్రివిక్రమ్ తో మరో సినిమాను చేయడానికి ఎన్టీఆర్ ఆసక్తిని చూపుతున్నాడు.

అవును జక్కన్న సినిమాలో షూటింగ్ పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని పట్టాలెక్కిస్తారు అని వార్తలు వస్తున్నాయి, అయితే ఈ సినిమా గురించి ఆల్రెడీ సిట్టింగ్ జరిగింది అని కథ కూడా నచ్చడంతో ఎన్టీఆర్ ఒకే చెప్పారు అని తెలుస్తోంది. ఇక త్రివిక్రమ్ అల వైకుంఠపురం నుంచి సక్సెస్ మూడ్ లో ఉన్నారు, అయితే ఎన్టీఆర్ కు సంబంధించిన కథని ఏప్రిల్ నాటికి రెడీ చేయాలి అని చూస్తున్నారు.

తన టీమ్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉంది, అంతేకాదు ఈ చిత్రాన్ని ఐదు నెలల్లో సెట్స్ నుంచి తీసి రెండు నెలల్లో ఎడిటింగ్ చేసి 2021 సంక్రాంతికి విడుదల చేయాలి అని పక్కా ప్లాన్ లో ఉన్నారట..ఈ కథ యాక్షన్ పాళ్లు తక్కువ .. ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. దాదాపు జంధ్యాల సినిమాలను గుర్తుచేసేలా ఈ కథ ఉంటుందని చెబుతున్నారు. ఇక ఫ్రిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమాపై అధికారిక ప్రటకన చేయనున్నారు అని తెలుస్తోంది.