ఎన్టీఆర్ ను ఎక్కువగా వాడుకుంది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలేనట

ఎన్టీఆర్ ను ఎక్కువగా వాడుకుంది ఆ ఇద్దరు ఎమ్మెల్యేలేనట

0

నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను వల్లనేని వంశీ అలాగే కొడాలి నానిలు ఎక్కువగా వాడుకుని వదిలేశారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు… తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని అన్నారు….

2009 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా నాని భీఫాం తీసుకున్న విషయం బోండా ఉమా గుర్తు చేశారు… అలాగే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా చంద్రబాబు నాయుడు మూడు సార్లు అవకాశం ఇచ్చారని అన్నారు….. వంశీ తన అవసరాలకోసం పార్టీ మారుతున్నారని అన్నారు… ఇవన్ని గన్నవరం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు…

గతంలో ఎన్టీఆర్ చెప్పారని తెలుగుదేశం పార్టీ మాత పెట్టిన పార్టీ నన్నెవరూ ఈ పార్టీలో ఉండమని చెప్పక్కర్లేదు అది నాబాధ్యత అని చెప్పారని గుర్తు చేశారు… ప్రస్తుతం ఆయన సినిమా ఫిల్డ్ లో ఉన్నారు కాబట్టి రాజకీయాలకు దూరంగా ఉన్నారని బోండా అన్నారు… కొడాలి నాని వంశీ వాళ్ల సీట్ల కోసం ఎన్టీఆర్ ను ఉపమోగించుకున్నారని విమర్శించారు…