రిలీజ్ కి ముందే మరో సినిమాను లైన్లో పెట్టేసిన వైష్ణవ్ తేజ్..!!

రిలీజ్ కి ముందే మరో సినిమాను లైన్లో పెట్టేసిన వైష్ణవ్ తేజ్..!!

0

మరో మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’.. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబుని దర్శకుడిగా పరిచయం చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ కూడా నిర్మాణంలో భాగస్వామ్యం వహిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.

ఇదిలా ఉంటె ఈ సినిమా పూర్తవుతుండగానే వైష్ణవ్ తేజ్ మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టుగా తెలుస్తోంది. ‘ఓ బేబీ’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నందినీ రెడ్డి, ఒక కథ వినిపించగా వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అశ్వనీదత్ కుమార్తెలు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.