వకీల్ సాబ్ కు హీరోయిన్ దోరికేసింది….

వకీల్ సాబ్ కు హీరోయిన్ దోరికేసింది....

0

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇక నుంచి తాను సినిమాలు తీయనని చెప్పిన సంగతి తెలిసిందే… అయితే ఆయన మనసు మార్చుకుని వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. అందులో ముందుగా బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన పింక్ మూవీలో నటిస్తున్నారు…

రీసెంట్ గా ఈ చిత్రానికి వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు… దాదాపు ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తి చేసుకుందని వార్తలు వస్తున్నాయి.. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్తల హల్ చల్ చేస్తోంది… దీనికి కారణం హీరోయిన్…. ఈ సినిమాలో హీరోయిన్ కోసం ప్రత్యేకంగా ఒక ఏపీ సోడ్ ను క్రియేట్ చేశారట..

చాలా తక్కువ నివిడి ఉన్న ఈ పాత్రకోసం చిత్రబృందం ఎదురు చూస్తోంది… అయితే తాజాగా ఈ పాత్రకు గోవా బ్యూటీ ఇలియానా నటించనుందని వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో సినిమాలు లేవు.. అందుకే ఈ పాత్రలో నటించడానికి ఒకే చెప్పిందట.. గతంలో జల్సా చిత్రంలో కూడా ఇల్లీ బేబీ నటించింది…