చంద్రబాబుకు బిగ్ షా…. క్ బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

చంద్రబాబుకు బిగ్ షా.... క్ బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే

0

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ వల్లభనేని వంశీ బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నారు… తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరితో వల్లభనేని వంశీ భేటీ అయ్యారు.

ఈ భేటీ అనేక అనుమానాలకు దారితీస్తోంది… గుంటూరు మర్యాద పూర్వకంగా కలిసిన వంశీని సుజనా తన కారులో ఎక్కించుకుని ఒంగోళుకు తీసుకువెళ్లారు. ఈ కలయిక ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మరుతోంది… ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే .

ఈ నలుగురిలో ఒకరు సుజనా చౌదరి… ఆయన ఇప్పుడు వల్లభనేని వంశీని బీజేపీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అందులో భాగంగానే ఆయనతో మంతనాలు జరిపేందుకు ఒంగోళుకు తన కారులో తీసుకువెళ్లారని విశ్లేషకులు అభావిస్తున్నారు…