వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే క్లారిటీ

వైసీపీలో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే క్లారిటీ

0

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ దీపావళి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకుంటారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలపై ఆయన స్పందించారు… తాజాగా వంశీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తాను 2006లో రాజకీయాల్లోకి వచ్చానని అప్పటినుంచి టీడీపీలో ఉన్నానని గుర్తు చేశారు… గత నాలుగు నెలల నుంచి తన నియోజకవర్గంలో అభివృద్ది కుంటుపడిందని అన్నారు…

ఇటీవలే తనపై అక్రమకేసులు పెట్టారని ఈ విషయంపై తాను జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యనని అన్నారు… ఈ విషయంలో జగన్ కూడా సానుకులంగా స్పందించారని అన్నారు… అలాగే పార్టీ మార్పు పై కూడా వంశీ స్పందించారు… దీపావళి తరువాత పార్టీ మార్పు గురించి చెబుతానని అన్నారు..