వాళ్లు మార‌ట్లేదు జ‌గ‌న్ సార్ కీల‌క నిర్ణ‌యం తీసుకోండి?

వాళ్లు మార‌ట్లేదు జ‌గ‌న్ సార్ కీల‌క నిర్ణ‌యం తీసుకోండి?

0

ఈ రోజుల్లో సోష‌ల్ మీడియా ప్రభావం ఎలా ఉందో తెలిసిందే. అయితే రాజ‌కీయంగా చూస్తే మాత్రం దీనిని చాలా వ‌ర‌కూ నెగిటీవ్ ప్ర‌చారాల‌కు వాడుతున్నారు, దీని వ‌ల్ల ఏకంగా కుటుంబాల‌ని కూడా రోడ్ల‌పైకి సోష‌ల్ మీడియా ద్వారా లాగుతున్నారు, ఇక సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వం పై సీఎం పై ప‌లు విమ‌ర్శ‌లు ఆరోప‌న‌లు చేస్తూ ఇష్టం వ‌చ్చిన రీతిలో పిచ్చి రాత‌లు రాసేవారు ఈ మ‌ధ్య పెరిగిపోయారు.

గ‌తంలో కొంద‌రిని గుర్తించి వారిపై వైసీపీ నాయ‌కులు కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయాలి అని కోరిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి, అయితే ఇప్పుడు మ‌రింత మంది రెచ్చిపోతున్నారు సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో… ఇలాంటి చెత్త రాత‌లు రాసేవారు సీఎం పై మంత్రుల‌పై ఇష్టం వ‌చ్చిన రాత‌లు కామెడీలు చేసేవారు పెరిగిపోతున్నారు.

ఈ స‌మయంలో ఇలాంటి వారిని గుర్తించి ఏపీ ప్ర‌తిష్ట‌కాపాడాలి అని, క‌చ్చితంగా ఇలాంటి వారిని క‌ట్ట‌డిచేయాలి అని వైసీపీ నాయ‌కులు సోష‌ల్ మీడియాలో కోరుతున్నారు, వెంట‌నే దీనిపై పోలీసులు యాక్ష‌న్ తీసుకోవాలి అని కోరుతున్నారు.