‘వాల్మీకి’ ప్రీ టీజర్.. మాటలుండవ్..!!

'వాల్మీకి' ప్రీ టీజర్.. మాటలుండవ్..!!

0

వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ‘వాల్మీకి’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ప్రీ టీజర్ ను వదలడానికి రంగాన్ని సిద్ధం చేశారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల 18 నిమిషాలకి ముహూర్తాన్ని ఖరారు చేశారు. అయితే ఇది కేవలం ప్రీటీజర్ మాత్రమేనని ఎలాంటి డైలాగ్స్ ఉండవని క్లారిటీ ఇచ్చారు.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగార్తండ’ సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్య షూటింగ్ కి వెళ్తున్న వరుణ్ తేజ్ కారుకి ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఎలాంటి గ్యాప్ ఇవ్వకుండా చిత్రయూనిట్ షూటింగ్ జరుపుతోంది. ఈ సినిమాలో తమిళ హీరో ఆదర్వా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.