వంశీ పైడిపల్లి మళ్ళీ ఆ హీరో నే నమ్ముకున్నాడా..!!

వంశీ పైడిపల్లి మళ్ళీ ఆ హీరో నే నమ్ముకున్నాడా..!!

0

టాలెంట్ ఉన్నా అదృష్టం లేని దర్శకుల్లో వంశీ పైడిపల్లి ఆ లిస్ట్ లో ఉంటాడని చెప్పాలి..ఊపిరి లాంటి సూపర్ హిట్ సినిమా ఇచ్చిన కూడా మహేష్ బాబు తో సినిమా కోసం మూడేళ్లు వెయిట్ చేసి ఆ సినిమా ని సూపర్ హిట్ చేశాడు.. కానీ ఆ టైం లో రెండు సినిమాలైనా చేసుండొచ్చు.. ఇక మహర్షి సినిమా హిట్ తర్వాత ఏ హీరో తో సినిమా చేస్తాడేమో అని అభిమానులు ఎదురు చూడగా మళ్ళీ మహేష్ తో నే తన సినిమా అని ఇన్సైడ్ గా వార్తలు వస్తున్నాయి..

ప్రస్తుతం మహెశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్.లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు-రామబ్రహ్మాం సుంకర్-మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత వంశీ సినిమా ఉండనుంది. ఇటీవలే వంశీ చెప్పిన ఓ లైన్ ని మహేష్ ఓకే చేశాడట. దీంతో స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో వంశీ ఉన్నాడట.