లోకేశ్ కు వంశీ వార్నింగ్

0

టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మాజీ మంత్రి నారాలోకేశ్ పై అలాగే తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలపై సంచలన వ్యాఖ్యాలు చేశారు.. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… తాను హైందవ సంప్రదాయాన్ని గౌరవించలేదని టీడీపీ నాయకులు అంటున్నారని అయితే తాను వెయ్యి కాళ్ల మండపం కూల్చలేదని దుర్గగుడిలో క్షుద్ర పూజలు చేయించుకోలేదని అన్నారు..

అలాగే తాను టీటీడీ చైర్మన్ పదవిని అమ్ముకోలేదని అన్నారు… ప్రజా క్షేత్రంలో గెలిచి తనను లోకేశ్ రాజీనామా చేయమని అనడం ఏంటని ప్రశ్నించారు… ఎమ్మెల్యేగా ఓటమి చెందిన లోకేశ్ ఎందుకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయకున్నారని ఆయన అన్నారు…

టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీలను వారి పదవులనుంచి తొలగించమని కోరుతూ ప్రధాని ఇంటిముందు ధర్నా చేద్దామని అన్నారు… ఇందుకు కావాల్సిన ఖర్చు మొత్తం తానే పెట్టుకుంటానని అన్నారు…