వంశీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫోన్

వంశీకి జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫోన్

0

తెలుగుదేశం పార్టీ పై తీవ్ర విమర్శలు చేసి ఆ పార్టీ మునిగిపోతోంది అని ఆరోపణలు చేసిన వల్లభనేని వంశీ గురించి, వైసీపీ సోషల్ మీడియా వీడియోలు వైరల్ చేస్తుంటే, టీడీపీ విమర్శలు ఖండనలు చేస్తోంది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ని కూడా వంశీ ఈ వివాదంలోకి లాగారు.

తెలుగుదేశం పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ని పక్కన పెట్టారు అని బాంబ్ పేల్చారు వంశీ.. అయితే 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం, తన కెరియర్ పణంగా పెట్టి, ఎన్టీఆర్ ప్రచారం చేశాడు, కాని ఎన్టీఆర్ ని చంద్రబాబు పక్కనపెట్డారని విమర్శించారు, ఇది అంతా లోకేష్ కోసం అని అన్నారు.

అయితే దీనిపై రాత్రి జూనియర్ ఎన్టీఆర్ కు ఈ విషయం తెలిసి వల్లభనేని వంశీతో ఫోన్లో మాట్లాడారు అని తెలుస్తోంది, పార్టీ గురించి తన గురించి కామెంట్లు ఎందుకు చేశావు అని చర్చించారట, అయితే తన బాధని వల్లభనేని చెప్పడం పై ఎన్టీఆర్ కూడా ఏమీ అనలేదు అని వార్తలు వినిపిస్తున్నాయి.