టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా భేటీ!

టీడీపీ అధినేత చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే వరుపుల రాజా భేటీ!

0

టీడీపీ కాపు నేతలు పార్టీ అధిష్ఠానానికి సమాచారం ఇవ్వకుండా ఇటీవల కాకినాడలోని ఓ హోటల్ లో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీకి టీడీపీ నేత తోట త్రిమూర్తులు, బూరగడ్డ వేదవ్యాస్, బోండా ఉమా, జ్యోతుల నెహ్రు, చెంగల్రాయుడు, బండారు మాధవనాయుడు, వరుపుల రాజా సహా పలువురు హాజరయ్యారు. దీంతో వీరంతా టీడీపీని వీడుతారని వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వరుపుల రాజా ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి ఈరోజు మధ్యాహ్నం చేరుకున్న రాజా, ఇటీవల జరిగిన పరిణామాలను అధినేతకు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. కాకినాడలో జరిగిన సమావేశం పార్టీకి వ్యతిరేకంగా కాదని తేల్చిచెప్పారు. తాను మరో పార్టీలో చేరబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.