వరుస ట్వీట్లతో కన్నాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న విజయసాయిరెడ్డి…

వరుస ట్వీట్లతో కన్నాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న విజయసాయిరెడ్డి...

0

కేంద్ర పార్టీ పంపిన నిధుల్లో 30 కోట్లు నొక్కేశారని ఎలక్షన్ల తర్వాత ఏపీ అధ్యక్ష్యుడు కన్నా లక్ష్మీనారాయణపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు అప్పట్లో పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి… స్థానికంగా సమీకరించిన విరాళాలూ దారి మళ్లాయని ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్లాయి. కన్నా తో కొత్తగా చేరిన నేతలు ఈ నిధులు పంచుకున్నట్టు పెద్దలకు తెలుసని అన్నారు…

కన్నా రక్షణకు బాబు తన వందిమాగదులను రంగంలోకి దింపారని అన్నారు. పార్టీ అధిష్టానం ఆయనను పదవి నుంచి తొలగిస్తే బీజేపీ రాష్ట్ర శాఖపై పెత్తనం పోతుందని టెన్షన్ మొదలైనట్టుంది. పచ్చ మీడియా ఇప్పటికే కన్నా సాము గారడీల కథనాలను పరిపరి విధాలుగా చూపిస్తోంది. కడాన బాబు కరివేపాకుల్లో ఇతనూ ఒకడవుతారని అన్నారు

చంద్రబాబుకు చీమ కుడితే బిజెపీలో ఉన్న సుజనా, సున్నా గిలగిలలాడతారు. బానిసత్వం, బ్రోకరిజం నేర్పించిన విశ్వాసం అది. రాష్ట్రంలోని అన్ని పార్టీలు బాబు కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. అందుకే బాబు ఉస్కో అనకముందే భౌభౌమంటాయి. ఎప్పుడు ఏవిధంగా విషం చల్లాలో దేశం ఆఫీసే కమాండ్స్ ఇస్తుందని అన్నారు.