వారి ఫోకస్ సీఎం జగన్ పైనే…

వారి ఫోకస్ సీఎం జగన్ పైనే...

0

అధికారంలో ఉన్నా లేకున్నా తమదంగా ఒకేదారి అన్నట్లు టీడీపీకీ చెందిన కొందరు నేతలు నిరూపించుకుంటున్నారు… అంతేకాదు వారు టీడీపీలో భజన బృందంలా తయారు అయ్యారని అంటున్నారు… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఆయన కుమారుడు నారాలోకేశ్ ను పొగటమే పనిగా పెట్టుకున్నారు…

టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒకరు మించి ఒకరు చంద్రబాబును మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు… ఒకరు మించిన మరొకరు ప్రశంశలు కురిపించారు… అయితే అసలు వాస్తవం ఎలా ఉన్నాఅంతా బాగా జరుగుతుందనే ఈ ఇద్దరు బాబులూ పాలన సాగించారు… ఇక అధికారం పోయింది…

ఇద్దరు బాబులు కూడా ఇంటికే పరిమితం అయ్యారు.. అధికారంలో ఉన్నప్పుడు రెండు రోజులకే ఎమ్మెల్సీ ద్వారా మంత్రి అయిన లోకేశ్ కూడా ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందారు… గతంలో చంద్రబాబు తో పాటు తమ రాజకీయం అని చెప్పిన నేతలు సైతం ఇప్పుడు సైకిల్ దిగిపోయారు…

దీంతో భజన బృందం లేనట్లే అని అందరు అనుకున్నారు… కానీ భజన ఏమాత్రం తగ్గలేదని అంటున్నారు… అయితు భజన బృందాలు మారాయి… వీరు ఇప్పుడు వైసీపీ సర్కార్ ను నిప్పులు చెరుగడమే లక్ష్యంగా చేసుకున్నారు…